మా జాతీయపార్టీ సన్నాహాలపై భయంతోనే షెడ్యూల్‌

కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాలకు భయపడే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను హడావుడిగా విడుదల చేశారని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated : 04 Oct 2022 06:32 IST

ఉప ఎన్నిక ప్రకటనపై మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ

సూర్యాపేట, న్యూస్‌టుడే: కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాలకు భయపడే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను హడావుడిగా విడుదల చేశారని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భాజపా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు వింటేనే హడలిపోతున్నారని మంత్రి అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తామంటూ కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన 24 గంటల్లోనే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడిందన్నారు. అమిత్‌షా మునుగోడు పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎన్నికల ప్రకటన వస్తుందని భావించామని తెలిపారు. పరిస్థితులు భాజపాకు ఆశాజనకంగా కనిపించకపోవడం వల్లే వాయిదాల పద్ధతిని ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టినా.. అమిత్‌షా, నడ్డా మునుగోడుకు వచ్చి కూర్చున్నా తెరాస విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో భాజపా మూడో స్థానానికి పరిమితం కానుందని, తమతో పోటీ పడేది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని