కేసీఆర్‌పై సొంతంగానే పోరాటం: ఈటల

కేసీఆర్‌ నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Published : 02 Dec 2022 03:45 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: కేసీఆర్‌ నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని గన్‌పార్కులో తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు కిష్టయ్య వర్ధంతి సభలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. మద్యం కేసులో ఆమె(కవిత) పాత్ర ఉందో, లేదో దర్యాప్తులో తెలుస్తుందన్నారు. వైఎస్‌ షర్మిలతో తమకేం సంబంధమని ప్రశ్నించారు. ఒకరిని పురిగొలిపే అవసరం భాజపాకు లేదన్నారు. కేసీఆర్‌పై సొంతంగానే పోరాటం చేస్తామన్నారు. ఓటుకు నోటు కేసులో పనిచేసిన పోలీసు అధికారులతోనే ప్రగతిభవన్‌ వేదికగా మళ్లీ స్కెచ్‌ వేశారన్నారు. రాష్ట్రంలో 16 మంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కామారెడ్డి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు తెలంగాణ తొలి అమరుడు పోలీసు కిష్టయ్య పేరు పెట్టాలని, ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని