న్యాయవిద్యను ఎత్తేసి న్యాయ రాజధాని కడతారా?

‘రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తారో.. చేయరో గానీ, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర విభాగాన్ని ఎత్తేస్తుంటే రాయలసీమ మంత్రులు సిగ్గు పడాలి.

Published : 06 Dec 2022 04:25 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: ‘రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తారో.. చేయరో గానీ, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని న్యాయశాస్త్ర విభాగాన్ని ఎత్తేస్తుంటే రాయలసీమ మంత్రులు సిగ్గు పడాలి. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా చదువుకున్నారు’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ పరిణామాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. ఒకవైపు లా డిపార్టుమెంటు మూసి వేస్తూ.. మరోవైపు రాయలసీమలో హైకోర్టు పెడతామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. సీమలో కూలీలు, రైతులు వలస పోతుంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి వలసలు అరికడతామని మంత్రులు వింత భాష్యాన్ని చెబుతున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని