Pawan Kalyan - Chandra Babu: ముగిసిన చంద్రబాబు - పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ల భేటీ ముగిసింది. తెదేపా సూపర్‌ సిక్స్‌, జనసేన షణ్ముఖ వ్యూహం కలిపి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం.

Updated : 14 Jan 2024 07:18 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ల (Pawan Kalyan) భేటీ ముగిసింది. ఉండవల్లిలో జరిగిన ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెదేపా (TDP) సూపర్‌ సిక్స్‌, జనసేన షణ్ముఖ వ్యూహం కలిపి మేనిఫెస్టోను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెదేపా, జనసేన (Janasena) వర్గాలు పేర్కొన్నాయి. 

భేటీలో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయమై ఇరువురు నేతలు చర్చించారు. తెలుగుదేశం - జనసేన పార్టీల్లో వైకాపా నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపు పైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రచార సభలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. అదే విధంగా మందడంలో ఆదివారం నిర్వహించే భోగి మంటలు కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు కలిసి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దహనం చేయనున్నారు. సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్​తో పాటు తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh), జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని