Priyanka Gandhi: వాటిని మీరు మర్చిపోయారా? ప్రధానికి ప్రియాంక సూటి ప్రశ్న

భాజపా అధికారిక ట్విటర్‌ ఖాతాలో రెచ్చగొట్టే పోస్టర్లు పోస్ట్‌ చేయడాన్ని ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమర్థిస్తున్నారా? అని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

Published : 06 Oct 2023 11:52 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చిత్రాన్ని రావణాసురుడి రూపంలోకి మార్చి భాజపా (BJP) ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంపై ఆయన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో భాజపా ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi), భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

‘‘మోదీజీ, జేపీ నడ్డాజీ.. రాజకీయాలను, రాజకీయ చర్చలను మీరు ఏ స్థాయికి దిగజార్చాలనుకుంటున్నారు? మీ పార్టీ అధికారిక ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌) ఖాతాలో రెచ్చగొట్టే విధంగా ఉన్న పోస్టర్లు, ఫొటోలు పోస్ట్‌ చేయడాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఇప్పటికైనా నిజాయితీగా ఉండండి. ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలు, చేసిన ప్రమాణాలను మర్చిపోయారా?’’ అని ప్రియాంక ట్వీట్ చేశారు. 

బాలీవుడ్‌ చుట్టూ ‘బెట్టింగ్‌ యాప్‌’ ఉచ్చు.. నటి శ్రద్ధా కపూర్‌కు ఈడీ సమన్లు

గురువారం భాజపా, కాంగ్రెస్‌ల మధ్య సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్ల యుద్ధం జరిగింది. రాహుల్‌ గాంధీ చిత్రాన్ని రావణాసురుడి రూపంలోకి మార్చి దానికి ‘కొత్త తరం రావణుడు’ అనే వ్యాఖ్యను జోడించి భాజపా ట్విటర్‌లో పోస్టు చేసింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఆ చర్య ఆమోదనీయం కాదని, పూర్తిగా ప్రమాదకరమైనదని అభివర్ణించింది. అంతేకాకుండా ప్రధాని మోదీ చిత్రానికి ‘అతిపెద్ద అబద్ధాలకోరు’ ‘బూటకపు హామీలరాయుడు’ అని వ్యాఖ్యలు చేర్చి దాన్ని ట్విటర్‌లో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని