YSRCP: రేపల్లె వైకాపాలో చిచ్చు.. 150 మంది మోపిదేవి అనుచరుల రాజీనామా

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైకాపా (YSRCP)లో సమన్వయకర్త మార్పు చిచ్చు రేపింది. పలువురు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.

Updated : 12 Dec 2023 15:08 IST

రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైకాపా (YSRCP)లో సమన్వయకర్త మార్పు చిచ్చు రేపింది. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్థానంలో డాక్టర్‌ ఈవూరు గణేశ్‌ను సమన్వయకర్తగా వైకాపా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రేపల్లె వైకాపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణకే సమన్వయకర్త బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మోపిదేవి వెంకటరమణ 14 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. ఆయన్ను పక్కన పెట్టి గణేశ్‌ను సమన్వయకర్తగా నియమించడం బాధాకరమని వైకాపా నేతలు అన్నారు. రేపల్లెలోని వైకాపా కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మోపిదేవికి మద్దతుగా వివిధ పదవుల్లో ఉన్న 150 మంది నేతలు రాజీనామా చేశారు. సమన్వయకర్త మార్పు నిర్ణయాన్ని వైకాపా అధిష్ఠానం పునఃసమీక్షించాలని కోరారు. రాజీనామా చేసిన వారిలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్మన్‌లు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాలకు చెందిన నేతలు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని