YS Sharmila: ట్యాంక్ బండ్‌పై గద్దర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: వైఎస్‌ షర్మిల

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించి ఓదార్చారు.

Updated : 13 Aug 2023 21:17 IST

హైదరాబాద్‌: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించి ఓదార్చారు. గద్దర్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ కళా రంగానికి తీరని లోటని అన్నారు. గద్దర్ సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌ జిల్లాలోని ఆయన స్వస్థలంలో స్మారక చిహ్నం ఏర్పాటుతోపాటు పాఠ్యాంశాల్లో ఆయన జీవిత అంశాలను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. విప్లవ భావాలు ఉద్యమ భావాలతో తన జీవితాన్ని గడిపిన గద్దర్.. వేలాది పాటలు రాసి ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించాలని కొనియాడారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని