YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు.

Updated : 31 Aug 2023 11:11 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల రగడ.. ఉత్తమ్‌, జానా కుటుంబాల నుంచి ఇద్దరు పోటీ?

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని