అస్సాంలో శాంతించని వరదలు

అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. బ్రహ్మపుత్ర, బరాక్‌, వాటి ఉపనదుల ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత 24 గంటల్లో మరో 19 మంది మృతి చెందారు. దీంతో గత ఏప్రిల్‌ 6

Published : 24 Jun 2022 06:03 IST

100 దాటిన మృతులు

దలైలామా రూ.10 లక్షల విరాళం

ఈనాడు, గువాహటి: అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. బ్రహ్మపుత్ర, బరాక్‌, వాటి ఉపనదుల ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత 24 గంటల్లో మరో 19 మంది మృతి చెందారు. దీంతో గత ఏప్రిల్‌ 6 నుంచి వరదల ప్రభావంతోపాటు కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 108కి చేరింది. 45లక్షల మందికిపైగా వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ 17,500 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి రక్షించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ వెల్లడించింది. కఛార్‌లో వరద పరిస్థితిని గురువారం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. అస్సాంలో వరద సహాయచర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. అస్సాంలో వరద పరిస్థితిని కేంద్రం నిరంతరాయంగా సమీక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

* అస్సాంలో వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజల పరిస్థితి చూసి ప్రసిద్ధ టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా రూ.10లక్షలు విరాళం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని