David Warner: కోచ్‌గా పనిచేయాలనేదే నా ఆశయం: డేవిడ్ వార్నర్

సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌.. కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఉందని వెల్లడించాడు.

Published : 07 Jan 2024 15:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ వన్డే, టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు (David Warner) ఓ ఆశయం ఉందట. ప్రస్తుతం టీ20లకు అందుబాటులో ఉన్న వార్నర్.. భవిష్యత్తులో క్రికెట్‌ నుంచి పూర్తిగా దూరమైతే కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తాడట. ‘‘నేను కోచ్‌గా రాణించగలననే నమ్మకం ఉంది. భవిష్యత్తులో నా ఆశయం కూడా అదే. దీని గురించి ఇప్పటికే నా భార్యతో మాట్లాడా. సంవత్సరంలో కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి ఉంటుందని చెప్పా’’ అని వార్నర్ వెల్లడించాడు.

మళ్లీ అవకాశం వస్తే..

‘‘నా కెరీర్‌లో ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని అనుకుంటున్నా. ఆట కోసం తీవ్రంగా శ్రమించా. జట్టు కోసం నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించా. ఒకవేళ మళ్లీ గతం పునరావృతమైతే.. ఇంకాస్త ఓపిక ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. కెరీర్‌ ప్రారంభంలో చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. రాన్రాను పరిణతి సాధించా. జట్టులో నా పాత్ర ఏంటనేది స్పష్టంగా తెలుసు. బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడటం చాలా ముఖ్యం. ఎవరికైనా తొలిసారి కలిగిన అభిప్రాయం త్వరగా మారదు’’ అని వార్నర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని