Team India : అంచనాలు లేకుండా వచ్చి.. అత్యంత ప్రమాదకారిగా మారి : టీమ్‌ఇండియాపై అక్తర్‌ ప్రశంసలు

ఆసియా కప్‌ 2023(Asia Cup 2023)లో టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనను పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) కొనియాడాడు.

Published : 19 Sep 2023 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ఆసియా కప్‌ ఫైనల్‌(Asia Cup 2023 Final)లో అదిరిపోయే ప్రదర్శనతో ఎనిమిదోసారి టైటిల్‌ గెలిచింది టీమ్‌ఇండియా(Team India). ప్రపంచకప్‌(ODI World Cup 2023) ముందు రోహిత్‌ సేనలో రెట్టింపు ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు  కురుస్తున్నాయి. భారత ప్రదర్శనను దాయాది పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

ఈ ఆసియాకప్‌(Asia Cup 2023)లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శన చేసిందంటూ అక్తర్‌ కొనియాడాడు. మోస్ట్‌ డేంజరస్‌ జట్టుగా ఇప్పుడు ప్రపంచకప్‌ వైపు ఆ జట్టు అడుగులు వేస్తోందని పేర్కొన్నాడు. ‘ఇలాంటి పూర్తి ఏకపక్ష ఫైనల్‌ జరుగుతుందని నేను ఊహించలేదు. రోహిత్‌ కెప్టెన్సీ మెరుగుపడింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి అతడు  గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఫైనల్‌లో శ్రీలంకను ఇంత దారుణంగా ఓడిస్తారని నేను అనుకోలేదు. ఇక ఇప్పటి నుంచి ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మారవచ్చు’ అని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు.

సిరాజ్‌ మియా.. నీ మాయ అదిరిందయ్యా..!

‘భారత్‌ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌ టోర్నీకి వెళ్తోంది. ఈ విషయం పాకిస్థాన్‌కే కాదు.. మిగతా అన్ని జట్లకు ఆందోళన కలిగించే విషయమే. ఈ విజయంతో తాము ఘనంగా ప్రపంచకప్‌లోకి అడుగుపెడుతున్నామంటూ టీమ్‌ఇండియా ప్రకటించుకుంది’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

ఇక ఆసియా కప్‌లో భాగంగా భారత్‌-పాక్‌(IND vs PAK) మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. మరో దాంట్లో టీమ్‌ఇండియా దాయాదిపై ఘన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని