ఇదిగో వామిక

కూతురు పుట్టి ఏడాది దాటినా  ఇప్పటిదాకా తన ఫొటోలు, వీడియోలేవీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోలేదు కోహ్లి, అనుష్క దంపతులు.

Published : 24 Jan 2022 05:10 IST

కేప్‌టౌన్‌: కూతురు పుట్టి ఏడాది దాటినా  ఇప్పటిదాకా తన ఫొటోలు, వీడియోలేవీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోలేదు కోహ్లి, అనుష్క దంపతులు. ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే నియంత్రించుకున్నట్లు వాళ్లిద్దరూ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ చివరి వన్డే సందర్భంగా కోహ్లి కూతురు వామిక వీడియో కెమెరాల కంట పడింది. కోహ్లి అర్ధశతకం సాధించినపుడు వామికకు అతణ్ని చూపిస్తూ తల్లి అనుష్క చప్పట్లు కొట్టడం వీడియోలో కనిపించింది.

వివాదంలో విరాట్‌: కోహ్లి అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికాతో చివరి వన్డేకు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అతను చూయింగ్‌ గమ్‌ నమలడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని