నిఖత్‌తో పోటీకి సిద్ధం

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల విభాగంలో బెర్తు కోసం ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నానని నీతూ చెప్పింది. కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలవగా.

Published : 13 Aug 2022 03:07 IST

దిల్లీ: 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల విభాగంలో బెర్తు కోసం ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నానని నీతూ చెప్పింది. కామన్వెల్త్‌ క్రీడల్లో నిఖత్‌ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలవగా.. నీతూ 48 కేజీల్లో పసిడి సాధించింది. ఈ క్రీడల కన్నా ముందు 52 కేజీల కేటగిరిలో నిఖత్‌ ప్రపంచ ఛాంపియన్‌ అయింది. పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల విభాగంలో 50, 54 కిలోల విభాగంలో పోటీలు జరగనున్నాయి. నిఖత్‌ 50 కిలోల విభాగంలోనే కొనసాగనుందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ‘‘నా బరువు సాధారణంగా 49 కిలోలు ఉంటుంది. 50 కిలోల విభాగంలో పోటీపడాల్సివస్తే కాస్త బరువు పెరిగి.. శరీర దృఢత్వంపై దృష్టిసారిస్తాను. ఒలింపిక్స్‌ బెర్తు కోసం నిఖత్‌తో పోటీపడాల్సి వస్తే వంద శాతం పోరాడతాను. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. అయితే నేను ప్రత్యర్థి ఎవరన్నది పట్టించుకోను. మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెడతాను. ఆరాధ్య బాక్సర్‌ మేరీకోమ్‌ ఆటను అనుసరిస్తాను. ఆమె మాటలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. దేశానికి మరిన్ని పతకాలు అందించాలనే లక్ష్యంతో ఉన్నా’’ అని నీతూ చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని