దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం

ఇటీవల సొంతగడ్డపై దూకుడైన ఆటతో న్యూజిలాండ్‌ను టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ చేసి, ఆ తర్వాత భారత్‌తో చివరి టెస్టును గెలుచుకున్న ఇంగ్లాండ్‌.. దక్షిణాఫ్రికాపై ఆ జోరు ప్రదర్శించలేకపోయింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి విలవిలలాడి ఇన్నింగ్స్‌ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 12 పరుగుల

Published : 20 Aug 2022 02:33 IST

లండన్‌: ఇటీవల సొంతగడ్డపై దూకుడైన ఆటతో న్యూజిలాండ్‌ను టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ చేసి, ఆ తర్వాత భారత్‌తో చివరి టెస్టును గెలుచుకున్న ఇంగ్లాండ్‌.. దక్షిణాఫ్రికాపై ఆ జోరు ప్రదర్శించలేకపోయింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి విలవిలలాడి ఇన్నింగ్స్‌ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్‌ అయిన ఇంగ్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణంగా విఫలమై 149 పరుగులకే కుప్పకూలింది. 161 పరుగుల లోటుతో మూడో రోజు, శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లిష్‌ జట్టు.. నోకియా (3/47), కేశవ్‌ మహరాజ్‌ (2/35), రబాడ (2/27), జాన్సన్‌ (2/13) ధాటికి నిలవలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లీస్‌ (35), బ్రాడ్‌ (35), కెప్టెన్‌ స్టోక్స్‌ (20) మాత్రమే కాసేపు నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 289/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 326 పరుగులకు ఆలౌటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని