రజత్‌, ముకేశ్‌లకు పిలుపు

నిలకడగా రాణిస్తున్న బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌ పటిదార్‌లకు తొలిసారి టీమ్‌ఇండియా నుంచి పిలుపొచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో వీళ్లిద్దరికీ చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌ ముగిశాక టీ20 ప్రపంచకప్‌ కోసం రోహిత్‌ సారథ్యంలోని జట్టు ఆస్ట్రేలియా వెళ్తుంది.

Published : 03 Oct 2022 02:11 IST

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు

దిల్లీ: నిలకడగా రాణిస్తున్న బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌ బ్యాటర్‌ రజత్‌ పటిదార్‌లకు తొలిసారి టీమ్‌ఇండియా నుంచి పిలుపొచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో వీళ్లిద్దరికీ చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్‌ ముగిశాక టీ20 ప్రపంచకప్‌ కోసం రోహిత్‌ సారథ్యంలోని జట్టు ఆస్ట్రేలియా వెళ్తుంది. ఈ నేపథ్యంలో సఫారీ సేనతో మూడు వన్డేల్లో ధావన్‌ కెప్టెన్సీలో తలపడే ద్వితీయ శ్రేణి భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. న్యూజిలాండ్‌- ఎతో అనధికార టెస్టుల్లో భారత్‌- ఎ తరపున అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచిన  ముకేశ్‌.. ఇరానీ కప్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అతను రంజీ సీజన్‌లో 20 వికెట్లతో రాణించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి రజత్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌, రంజీ ట్రోఫీ ఫైనల్‌, న్యూజిలాండ్‌-ఎతో సిరీస్‌లో శతకాలు సాధించాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు చోటు దక్కించుకోలేకపోయిన శాంసన్‌.. వన్డేలకు జట్టులోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు స్టాండ్‌బైలుగా ఎంపికైన శ్రేయస్‌, దీపక్‌ చాహర్‌ కూడా ఈ సిరీస్‌లో ఆడతారు. తర్వాత వీళ్లు ఆస్ట్రేలియా వెళ్తారు. గురువారం (లఖ్‌నవూ) తొలి వన్డే జరుగుతుంది. ఈ నెల 9న రెండో (రాంచి), 11న మూడో (దిల్లీ) మ్యాచ్‌ నిర్వహిస్తారు.

జట్టు: ధావన్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌, శుభ్‌మన్‌, శ్రేయస్‌ (వైస్‌ కెప్టెన్‌), రజత్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, శాంసన్‌, షాబాజ్‌ అహ్మద్‌, శార్దూల్‌, కుల్‌దీప్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌, అవేశ్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని