19 ఏళ్ల తర్వాత ఫైనల్లో

ఆస్ట్రేలియా టెన్నిస్‌ జట్టు అదరగొట్టింది. 19 ఏళ్ల తర్వాత డేవిస్‌ కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

Published : 27 Nov 2022 01:56 IST

డేవిస్‌ కప్‌ తుదిపోరుకు ఆసీస్‌

మలగ (స్పెయిన్‌): ఆస్ట్రేలియా టెన్నిస్‌ జట్టు అదరగొట్టింది. 19 ఏళ్ల తర్వాత డేవిస్‌ కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఆ జట్టు 2-1 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో బోర్నా కొరిచ్‌ 6-4, 6-3తో కొకినాకిస్‌పై గెలిచి క్రొయేషియాకు ఆధిక్యం అందించాడు. కానీ రెండో సింగిల్స్‌లో అలెక్స్‌ డిమినార్‌ 6-2, 6-2తో మారిన్‌ సిలిచ్‌పై గెలిచి ఆసీస్‌ ఆశలను నిలిపాడు. ఇక నిర్ణయాత్మక డబుల్స్‌ పోరులో జోర్డాన్‌- పర్సెల్‌ జోడీ 6-7 (3-7), 7-5, 6-4తో నికోలా మెక్టిచ్‌- పావిచ్‌పై నెగ్గి ఆసీస్‌ను ఫైనల్లో నిలబెట్టింది. తొలి సెట్‌ టైబ్రేకర్‌లో ఓటమి తర్వాత ఆసీస్‌ ద్వయం బలంగా పుంజుకుంది. హోరాహోరీగా సాగిన రెండో సెట్లో కీలక సమయంలో ఆధిపత్యం ప్రదర్శించి పైచేయి సాధించింది. చివరి సెట్లోనూ అదే జోరు కొనసాగించి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ఈ పోరులో ఆసీస్‌ జంట 13 ఏస్‌లు కొట్టింది. కెనడా, ఇటలీ మధ్య సెమీస్‌ విజేతతో ఆ జట్టు తుదిపోరులో తలపడుతుంది. ఇప్పటికే 28 సార్లు డేవిస్‌ కప్‌ టైటిల్‌ గెలిచిన కంగారూ జట్టు చివరగా 2003లో ఫైనల్‌ చేరి విజేతగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని