మెస్సీసేన ముందుకా.. వెనక్కా?

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియొనెల్‌ మెస్సి.. గ్రూప్‌ దశ తర్వాత తన జట్టుతో పాటు రేసులో ఉంటాడా లేదా అన్నది బుధవారం తేలిపోతుంది.

Published : 30 Nov 2022 02:41 IST

నేడు పోలెండ్‌తో అర్జెంటీనాకు చావో రేవో

దోహా: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియొనెల్‌ మెస్సి.. గ్రూప్‌ దశ తర్వాత తన జట్టుతో పాటు రేసులో ఉంటాడా లేదా అన్నది బుధవారం తేలిపోతుంది. వేరే సమీకరణాలపై ఆధారపడకుండా నాకౌట్‌ చేరాలంటే గ్రూప్‌-సిలో తన చివరి మ్యాచ్‌లో పోలెండ్‌ను అర్జెంటీనా ఓడించాలి. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో షాక్‌ తిన్న అర్జెంటీనా, రెండో మ్యాచ్‌లో మెక్సికోను 2-0తో ఓడించినప్పటికీ.. సురక్షిత స్థితిలో లేదు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో పోలెండ్‌ను ఓడిస్తే మెస్సీసేన ముందంజ వేస్తుంది. ఈ మ్యాచ్‌ డ్రా అయితే అదే సమయంలో మెక్సికో-సౌదీ అరేబియా మ్యాచ్‌ ఫలితంపై ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మరోవైపు మెక్సికోతో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న  పోలెండ్‌.. సౌదీ అరేబియాపై నెగ్గింది. అర్జెంటీనాతో డ్రా చేసుకున్నా ఆ జట్టు ముందంజ వేస్తుంది. ఓడితే ఆ జట్టుకూ కష్టమవుతుంది. సౌదీ, మెక్సికో కూడా నాకౌట్‌ రేసులో ఉండడంతో గ్రూప్‌ ఆసక్తి రేపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని