Shoaib Akhtar: భారత్‌, పాక్‌ ఫైనల్‌ ఆడాలి.. అభిమానులతో ముచ్చటించాలి

ఆసియా కప్‌ గ్రూప్‌-4లో రెండు ఓటములతో ఫైనల్‌ ఆశలను క్లిష్టతరం చేసుకుంది టీమ్‌ఇండియా. భారత జట్టు ఫైనల్‌ చేరాలంటూ అద్భుతాలు జరగాల్సిందే........

Published : 07 Sep 2022 22:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ గ్రూప్‌-4లో రెండు ఓటములతో ఫైనల్‌ ఆశలను క్లిష్టతరం చేసుకుంది టీమ్‌ఇండియా. భారత జట్టు ఫైనల్‌ చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘భారత్‌, పాక్‌ ఫైనల్లో ఆడాలని నేను కోరుకుంటున్నా. ఫైనల్‌ టికెట్లు ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. మ్యాచ్‌ను చూస్తూ.. భారత్‌, పాక్‌ అభిమానులతో ముచ్చటించాలని ఉంది’ అని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

రానున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌, పాక్‌ జట్లు పోటీపడే మ్యాచ్‌ను కూడా వీక్షించేందుకు తాను సిద్ధమైనట్లు అక్తర్‌ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో మెల్‌బోర్న్‌ వేదికగా అక్టోబర్‌ 23వ తేదీన ఈ జట్లు తలపడనున్నాయి. ‘మెల్‌బోర్న్‌ సైతం వెళ్లి పాకిస్థాన్‌ మ్యాచ్‌లను వీక్షిస్తా’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

రోహిత్ శర్మ తన కెప్టెన్సీకి పదును పెట్టాలి

ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా తన ఓటములకు కారణాలు తెలుసుకొని వాటిని అధిగమించాలని అక్తర్‌ పేర్కొన్నాడు. కుంగిపోవాల్సిన అవసరం లేదన్నాడు. ‘భారత్‌ చెత్తగా ఏం ఆడలేదు. కానీ వారి ప్రదర్శన అభిమానులకు సంతృప్తినివ్వలేదు. భారత జట్టు పుంజుకుంటుందని ఆశిస్తున్నా. ఇది ప్రపంచకప్‌లో వారికి ఉపయుక్తంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌ రోహిత్‌ మంచి కాంబినేషన్‌ను గుర్తించాలి. ఓపిగ్గా ఉంటూ తన కెప్టెన్సీకి పదునుపెట్టాలి’ అని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని