Jasprit Bumrah: వికెట్‌ సెలబ్రేషన్స్‌ వీడియో వైరల్.. అలా ఎందుకు చేశానంటే?: బుమ్రా

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సరికొత్త విధంగా వికెట్ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. అందుకు గల కారణాన్ని అతడు తాజాగా బయటపెట్టాడు. 

Published : 15 Oct 2023 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌ (Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా (4/39) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ కెప్టెన్ హష్మతుల్లా షాహిదిని ఔట్‌ చేసిన అనంతరం బుమ్రా సరికొత్తగా సంబరాలు చేసుకున్నాడు. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాడు మార్కస్‌ రాష్‌ఫోల్డ్‌ను అనుకరించడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌ (Pakistan)తో మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా అవార్డు అందుకున్న అనంతరం బుమ్రా మాట్లాడాడు. ఈ సందర్భంగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మార్కస్‌ రాష్‌ఫోల్డ్‌ను అనుకరించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

IND vs PAK: అప్పుడు నా బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం వారికి కష్టమే: కుల్‌దీప్‌

కొంతకాలం క్రితం రాష్‌ఫోర్డ్ ఇలా చేయడం తాను చూశానని, అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆ విషయం గుర్తుకు రావడంతో అలా చేశానని బుమ్రా పేర్కొన్నాడు. ‘‘వైరల్ అవ్వడం కోసం అలా చేయలేదు. నాకు ఆ ఉద్దేశం లేదు. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ రాష్‌ఫోల్డ్ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చూశా. ఇది చాలా బాగుంది అని నేను అనుకున్నాను. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో హష్మతుల్లాను ఔట్‌ చేసిన అనంతరం ఆ విషయం నాకు గుర్తుకు వచ్చింది. దీంతో అతడిని అనుకరిస్తూ సంబరాలు చేసుకున్నా. దీని వెనుక ప్రత్యేకమైన పెద్ద కథ ఏమీ లేదు’’ అని బుమ్రా వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని