LSG Cricket Academy: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ తొలి క్రికెట్‌ అకాడమీ.. ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ (LSG) కూడా నాణ్యమైన క్రికెటర్లను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. 

Updated : 19 Aug 2023 12:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పలు ఫ్రాంచైజీలకు సొంత క్రికెట్ అకాడమీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ కూడా పయనిస్తోంది. తొలి క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలోనే వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం దీనిని ప్రారంభించనున్నట్లు ఎల్‌ఎస్‌జీ వెల్లడించింది. లఖ్‌నవూ వేదికగా వరల్డ్‌ కప్‌లో ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో భారత్‌ - ఇంగ్లాండ్ మ్యాచ్ (అక్టోబర్ 29న) కూడా ఉంది. డిసెంబర్ - జనవరి నాటికి సేవలను అందించేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏకనా స్పోర్ట్జ్స్‌ సిటీ సహకారంతో లఖ్‌నవూ ఈ అకాడమీని నిర్వహించబోతోంది. 

ODI World Cup 2023 : బెన్ కంటే ముందు ఇమ్రాన్

‘‘ఒకరికొకరం సహకారం అందించుకుంటూ తప్పకుండా మెరుగైన కార్యకలాపాలు నిర్వహిస్తామనే నమ్మకముంది. వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత ఎల్‌ఎస్‌జీ - ఏకనా క్రికెట్‌ అకాడమీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఏకనా క్రికెట్ అకాడమీ - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అకాడమీ విలీనం కావు. సంయుక్తంగా పని చేస్తాయి’’ అని ఎల్‌ఎస్‌జీ అధికార ప్రతినిధి వెల్లడించారు. వరుసగా రెండు సీజన్లలో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఈ జట్టు కప్‌ గెలుచుకోవడంలో మాత్రం విఫలమైంది. ఈ క్రమంలో కోచింగ్‌ సిబ్బందిని మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కోచ్‌గా ఆండీఫ్లవర్‌ స్థానంలో ఆసీస్‌ మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది. ఆండీఫ్లవర్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. అలాగే స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్కే ప్రసాద్‌ నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ కూడా వైదొలిగేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని