LSG vs MI: నవీనుల్ హక్.. రోహిత్ ఔట్ విషయంలోనూ అదే తీరు!
ముంబయి ఇండియన్స్ (MI) అదరగొట్టే విజయం సాధించింది. లఖ్‌నవూను 81 పరుగుల తేడాతో (LSG vs MI) చిత్తు చేసింది. దీంతో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో రెండో క్వాలిఫయర్‌లో తలపడేందుకు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL 2023) ముంబయి ఇండియన్స్ రెండో క్వాలిఫయర్‌కు చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను 81 పరుగుల తేడాతో ముంబయి చిత్తు చేసింది. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. పది బంతుల్లో కేవలం 11 పరుగులే చేసి నవీనుల్ హక్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో నవీనుల్ హక్ చేసుకున్న వికెట్ సంబరాలు సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. చెవులను మూసుకొని తన జెర్సీని చూపిస్తూ సంబరపడ్డాడు. కామెరూన్ గ్రీన్‌ను ఔట్ చేసిన సమయంలోనూ ఇలానే ప్రవర్తించాడు. దీంతో ముంబయి ఇండియన్స్ జట్టు అభిమానులు నెట్టింట విమర్శలు గుప్పించారు. ఇలాంటి యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఐపీఎల్ నుంచి నిషేధానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. లఖ్‌నవూ ఫ్యాన్స్ మాత్రం నవీనుల్ హక్కు మద్దతుగా పోస్టులు పెట్టారు.
గతంలో విరాట్ కోహ్లీతో వాగ్వాదం చేసిన తర్వాత నవీనుల్ విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. ‘స్వీట్ మ్యాంగోస్’ అంటూ ఆర్సీబీ మ్యాచ్‌ల సందర్భంగా విరాట్‌ను ఉద్దేశిస్తున్నట్లుగా పెట్టిన ట్వీట్లు వైరల్ మారాయి. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ నవీనుల్ హక్ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
అక్కడ నుంచి కింద పడిపోయాం: కృనాల్
ముంబయి చేతిలో ఓటమికిగల కారణాలను లఖ్‌నవూ కెప్టెన్ కృనాల్ పాండ్య వెల్లడించాడు. ‘‘చాలా మంచి స్థితి నుంచి ఒక్కసారిగా కిందకి పడిపోయాం. నేను కూడా అలాంటి షాట్ ఆడాల్సింది కాదు. ఇంకాస్త మెరుగైన క్రికెట్ ఆడితే విజయం సాధించేవాళ్లం. బ్యాట్ మీదకు బంతి చక్కగా వచ్చింది. అయినా, సరిగా ఆడలేపోకపోయాం. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత నుంచి నాణ్యమైన క్రికెట్ ఆడలేదు. క్వింటన్ డికాక్ సూపర్ బ్యాటర్. కానీ, మేయర్స్‌కు ఇక్కడ మంచి రికార్డు ఉంది. అందుకే అతడిని తీసుకున్నాం. ముంబయి బ్యాటర్లు తమ ఫాస్ట్ బౌలింగ్ దీటుగా ఎదుర్కొన్నారు.. అందుకే స్పిన్‌ను త్వరగా ప్రారంభించాల్సి వచ్చింది’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో గత మ్యాచ్‌లో కోల్‌కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్‌రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్‌ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్‌కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్‌కు పిచ్‌ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం డ్రాప్ ఇన్ పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్‌కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్‌కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.