Tamim - RR: తమీమ్‌ ‘యూ టర్న్’పై రాజస్థాన్‌ రాయల్స్ ఆసక్తికర ట్వీట్!

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు క్రికెట్‌లో చోటు చేసుకున్న వేగవంతమైన సంఘటనలను రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) ట్వీట్‌ రూపంలో తెలిపింది. అయితే, అందులో తమీమ్‌ ఇక్బాల్‌ నిర్ణయం కూడా ఉండటం గమనార్హం.

Published : 08 Jul 2023 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్క రోజు వ్యవధిలోనే తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్‌పై (Tamim Iqval) నెట్టింట ట్రోలింగ్‌ ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనా ఒత్తిడితో తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తమీమ్‌ ప్రకటించాడు. దీంతో తమీమ్‌ ‘యూ టర్న్’పై రాజస్థాన్‌ రాయల్స్‌ సరదాగా స్పందించింది. ఈ ఏడాది అత్యంత వేగంగా చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. అందులో ఎంఎస్ ధోనీ స్టంపింగ్‌, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ, మార్క్‌వుడ్ వేగవంతమైన బంతి, తమీమ్ ఇక్బాల్‌ రిటైర్‌మెంట్ నిర్ణయం.. అంటూ నాలుగు ఫొటోలను జత చేసింది. 

  • ఐపీఎల్‌ 2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ అత్యంత వేగంగా శుభ్‌మన్‌ గిల్‌ను స్టంపౌట్‌ చేశాడు. కేవలం 0.1 సెకన్ల వ్యవధిలోనే చేయడం విశేషం. 
  • ఇదే ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై వీరవిహారం చేశాడు. 
  • ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌ మూడో టెస్టులో మార్క్‌ వుడ్‌ ఏకంగా 96.5 మైళ్ల వేగంతో (155 కి.మీ) బంతిని సంధించాడు. ఈ ఏడాది క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధిక వేగవంతమైన బంతి ఇదే. 
  • ఇప్పుడు తమీమ్‌ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్లు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం ప్రకటించాడు. కొత్త కెప్టెన్‌ను చూసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించాడు. తీరా 24 గంటలు ముగియకముందే తన రిటైర్‌మెంట్‌ను తమీమ్‌ వెనక్కి తీసుకోవడం జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని