IND vs SL: శ్రీలంకతో భారత్ పోరు.. వర్షం గండం తప్పదా..? తుది జట్టు ఎలా ఉండేనో?
ఒక్క రోజు వ్యవధిలో భారత్ మరో వన్డే మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే, దానికీ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంకతో టీమ్‌ఇండియా తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: రెండు రోజులపాటు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఇవాళ కూడా ఆసియా కప్ సూపర్ -4లో భాగంగా శ్రీలంకతో కొలంబో వేదికగానే భారత్ తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే, భారత్ మ్యాచ్‌లకు వరుణుడి గండం మాత్రం తప్పేలా లేదు. లీగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్‌లోనూ వర్షం పలకరించింది. ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ రిపోర్ట్ చెబుతోంది. ఇక టీమ్‌ఇండియా తుది జట్టుపైనే అందరి దృష్టి ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే మ్యాచ్ ఆడబోతుండటం క్రికెటర్లపై ఒత్తిడికి గురి చేసే అంశమే. మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ లోగా వాతావరణ పరిస్థితిపై ఓ లుక్కేద్దాం..
ఇదీ వాతావరణ పరిస్థితి..
- 2 గంటలు: ప్రస్తుతం కొలంబోలో వాతావరణం కాస్త పొడిగానే ఉంది. రెండు గంటల నుంచి 3 గంటల వరకు కొంచెం మేఘావృతమై ఉంటుంది.
- 3 గంటలు: ఉరుములు, మెరుపులతో కూడి చిరు జల్లులు పడే అవకాశం ఉంది. వర్షం వచ్చే అవకాశాలు 56 శాతంగా ఉన్నాయి.
- 4 గంటలు: వరుణుడు కాస్త తెరిపినిస్తాడు. అయితే, మేఘాలు కమ్ముకొని ఉంటాయి. వర్ష సూచన 40 శాతంగానే ఉంది.
- 5 గంటల నుంచి 10 గంటల వరకు: ఈ సమయంలో మేఘావృతమై ఉంటుంది. కానీ, వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు.
- రాత్రి 11 గంటలకు: ఈ సమయంలో కొంచె వర్షం పడే అవకాశం ఉంది. కానీ ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. మ్యాచ్ నిర్వహణకు ఇబ్బంది ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి.
మార్పులు ఉండకపోవచ్చు
శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఫైనల్‌కు చేరుకోవడానికి కీలకమైన ఇలాంటి సమయంలో మేనేజ్‌మెంట్ మార్పులు చేస్తుందనే భావించడం కష్టమే. అయితే, టాప్‌ఆర్డర్‌తోపాటు మిడిలార్డర్ రాణించిన నేపథ్యంలో అదనంగా మరొక పేసర్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ షమీని తీసుకుంటే పేస్ దళం మరింత బలంగా మారనుంది. బుమ్రా, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతోపాటు లయను అందిపుచ్చుకోవడం భారత్‌కు సానుకూలాంశంగా మారింది. బ్యాటింగ్‌లో ఏవైనా ప్రయోగాలు చేయాల్సి వస్తే ఇషాన్‌కు బదులు సూర్యను ఆడించొచ్చు. అయితే, శ్రీలంక బౌలర్లు తీక్షణ, పతిరన బౌలింగ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాల్‌తో కూడుకున్నదే. స్వదేశంలో వారి సొంత మైదానాల్లో వీరిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ -4లోనే బంగ్లాదేశ్‌ను కట్టడి చేసిన తీరు అమోఘం. ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా భారత్‌కు పరాభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్
శ్రీలంక: కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), డాసున్ శనక (కెప్టెన్), పాథున్ నిస్సాంక, దిముత్ కరుణరత్నె, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, వెల్లలాగే, తీక్షణ, రజిత, పతిరన
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: మాజీ మంత్రి బండారుకు నారా లోకేశ్ ఫోన్
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..