IND vs PAK: పాక్‌తో పోరు.. ఇన్నింగ్స్‌ను ప్రారంభించేదెవరు? ఇషాన్ బరిలోకి దిగేదెక్కడ?
పాకిస్థాన్ ఇప్పటికే తన తుది జట్టును ప్రకటించింది. మ్యాచ్ సమయానికి భారత్ వెల్లడించే అవకాశం ఉంది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్‌పైనే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ టోర్నీకి ట్రయల్స్‌గా భావించే మినీ టోర్నీ ఆసియా కప్ (Asia Cup 2023) ప్రారంభమైంది. ఇందులో సత్తా చాటేందుకు రోహిత్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇవాళ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన పాక్.. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతోంది. ఈ నేపథ్యంలో దాయాది దేశాన్ని ఎదుర్కోవాలంటే.. పక్కా ప్రణాళికలతో టీమ్‌ఇండియా (Team India) బరిలోకి దిగాల్సి ఉంటుంది.
ఓపెనింగ్ జోడీ ఎవరో..
ఆసియా కప్ (Asia Cup 2023) కోసం బీసీసీఐ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. గాయాల అనంతరం జట్టులోకి వచ్చారు. సంజూశాంసన్‌ను కేఎల్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే.. పూర్తిగా సిద్ధంగా లేకపోవడంతో కేఎల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం తెలిపింది. దీంతో తుది జట్టులోకి ఇషాన్ కిషన్ రావడం ఖాయం. అయితే.. అతడిని ఎక్కడ ఆడించాలనేదానిపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఇషాన్‌ను ఓపెనింగ్ జోడీలో ఒకడిగా పంపించాలా..? మిడిలార్డర్‌లో ఆడించాలా..? అనేది మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది.
ఆసియా కప్‌లో భారత ‘బలగం’.. అదరగొట్టేదెవరు?
రోహిత్ శర్మ గైర్హాజరీలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్‌తో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలు బాది.. మొత్తం 184 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే.. ఇప్పుడు రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. మరి అతడికి జోడీగా ఎవరు ఆడతారనేది తేలాల్సి ఉంది.
మరోవైపు ఓపెనర్‌గానే ఇషాన్.. సక్సెస్ అయిన విషయం తెలిసిందే. గత ఏడాది వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చి బంగ్లాపై అతడు డబుల్ సెంచరీ నమోదు చేసిన విషయం ఎవరూ మర్చిపోరు. మరో వైపు ఇషాన్‌కు మిడిలార్డర్‌లో అనుభవం తక్కువే. ఈ స్థానంలో పెద్దగా రాణించిందేమీ లేదు. ఒక వేళ ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపిస్తే.. ఇప్పుడు గిల్ ఏ స్థానంలో ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మూడో స్థానంలో స్థిరంగా బ్యాటింగ్‌కు వచ్చే విరాట్ కోహ్లీని సెకండ్ డౌన్‌కు (నాలుగో స్థానం) పంపించే అవకాశాలూ లేకపోలేదు. అప్పుడు గిల్ మూడో స్థానంలోకి రావచ్చు. దీంతో కేఎల్ రాహుల్ గైర్హాజరీలో వచ్చే ఇషాన్‌ను ఏ స్థానంలో ఆడిస్తారనేది తెలియాలంటే మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.
జట్టు (అంచనా):
భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్, జడేజా, కుల్‌దీప్, సిరాజ్/ అక్షర్ పటేల్, షమీ, బుమ్రా
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్
-
USA vs China: ‘తప్పుడు సమాచారం’పై.. అమెరికా-చైనా మాటల యుద్ధం