వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలయ్యే

Published : 17 Jan 2022 04:27 IST

చేర్యాల, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా సంక్రాంతి పండగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలయ్యే ఈ జాతర మూడు నెలల పాటు జరుగుతుంది. ఉగాది పండగకు ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఉత్సవాలు ముగుస్తాయి. జాతర ప్రారంభమైన మొదటి సోమవారం హైదరాబాద్‌ భక్తులు ఆనవాయితీగా నిర్వహించాల్సిన ‘పట్నం-అగ్నిగుండాలు’ కార్యక్రమాలను కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో రద్దు చేశారు. భక్తులు వర్షాన్నీ లెక్కచేయకుండా జాతరకు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మొదటి రోజు 25 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ భిక్షపతి, ఈవో బాలాజీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని