
రాష్ట్ర రైతులపై సీఎంది సవతి ప్రేమ
తెరాస, భాజపా, వైకాపా ఒక్కటే: జగ్గారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఏ ఒక్క రైతు దగ్గరకు వెళ్లని సీఎం కేసీఆర్ పంజాబ్ రైతుల దగ్గరకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెరాస, భాజపా, మజ్లిస్, వైకాపాలు రాజకీయంగా ఒక్కటేనని అన్నారు. మంగళవారమిక్కడ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘పంజాబ్‌లో ఆప్, హరియాణాలో భాజపా ప్రభుత్వాలు ఉన్నచోటుకు సీఎం ఎందుకు వెళ్లారు. వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. సొంత రాష్ట్ర రైతులపై సీఎం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు. బతకడానికి ధీమా ఇవ్వకుండా చనిపోతే బీమా ఇస్తున్నారు. ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆ పథకాన్నే కేసీఆర్ కొనసాగిస్తున్నారు. రూ.లక్ష రుణమాఫీకి నాలుగేళ్లు పట్టింది’ అని దుయ్యబట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rishabh Pant: ఇంగ్లాండ్ గడ్డపై 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పంత్
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఎనిమిదో వికెట్ డౌన్.. క్రీజులో జడేజా, బుమ్రా
-
Movies News
God Father: ‘గాడ్ ఫాదర్’ ఆగయా.. లుక్‌తోనే అంచనాలు పెంచుతున్న చిరు
-
Business News
Suzuki katana: మార్కెట్లోకి సుజుకీ స్పోర్ట్స్ బైక్.. ధర ₹13.61 లక్షలు
-
India News
MK Stalin: ఎవరైనా అలా చేస్తే నేనే డిక్టేటర్‌గా మారతా.. చర్యలు తీసుకుంటా : సీఎం స్టాలిన్
-
Politics News
Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు