ఆవు పొట్టలో.. ప్లాస్టిక్‌ గుట్ట!

ప్లాస్టిక్‌(పాలిథిన్‌) కవర్లను విచ్చలవిడిగా వాడొద్దని, ఆహార వ్యర్థాలతో ఇష్టారాజ్యంగా వాటిని వీధుల్లోకి విసిరేయవద్దని ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకుంటున్నా వినే వారెందరు? అలాంటి వారి నిర్లక్ష్యమే

Published : 19 Jan 2022 03:51 IST

ఆవుకు శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడు గోవింద్‌ నాయక్‌

ప్లాస్టిక్‌(పాలిథిన్‌) కవర్లను విచ్చలవిడిగా వాడొద్దని, ఆహార వ్యర్థాలతో ఇష్టారాజ్యంగా వాటిని వీధుల్లోకి విసిరేయవద్దని ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకుంటున్నా వినే వారెందరు? అలాంటి వారి నిర్లక్ష్యమే మూగజీవుల పాలిట ప్రాణాంతకం అవుతోంది. అందుకు సోదాహరణంగా నిలిచేదే తాజా సంఘటన.. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ(కె) గ్రామవాసి  రైతు ఆశన్నకు చెందిన ఆవు 10 రోజులుగా కడుపు ఉబ్బరంతో సతమతమవుతోంది. ప్రైవేటు వైద్యుడిచే చికిత్స చేయించినా తగ్గలేదు. ఈ క్రమంలో రైతు ఇచ్చోడ పశువైద్యుడు గోవింద్‌నాయక్‌ను సంప్రదించారు. మంగళవారం ఉదయం ఆవును పరిశీలించిన ఆయన.. దాని కడుపులో గుట్టలా ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నట్లు నిర్ధారించి శస్త్ర చికిత్స చేశారు. 20 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి మూగజీవిని బతికించారు.

- న్యూస్‌టుడే, ఇచ్చోడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని