‘క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తిచేయండి’

మిగిలిన ఉన్న క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ఆన్‌లైన్‌ (వర్చ్యువల్‌) విధానంలో పూర్తి చేయాలని తెలంగాణ తరఫు న్యాయవాది కె.పళనిస్వామి కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ను కోరారు. తన తల్లి 90 ఏళ్ల వృద్ధురాలని, కొవిడ్‌

Published : 25 Jan 2022 04:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: మిగిలిన ఉన్న క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ఆన్‌లైన్‌ (వర్చ్యువల్‌) విధానంలో పూర్తి చేయాలని తెలంగాణ తరఫు న్యాయవాది కె.పళనిస్వామి కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ను కోరారు. తన తల్లి 90 ఏళ్ల వృద్ధురాలని, కొవిడ్‌ పరిస్థితులు, ఆమె ఆరోగ్య సమస్యలతో పాటు తనకూ వయసు రీత్యా ఉన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో కోయంబత్తూర్‌ నుంచి వెలుపలికి వచ్చే పరిస్థితిలేదన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం తరఫున న్యాయవాది నిఖిల్‌ స్వామి సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని