USA: ‘వివేక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు’: ట్రంప్‌ వర్గం

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వర్గం నుంచి భారత సంతతి నేత వివేక్‌ రామస్వామికి ఓ ప్రతికూల ప్రకటన వచ్చింది. ట్రంప్‌నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని ఆ ప్రకటన తెలిపింది.

Published : 17 Jan 2024 06:28 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వర్గం నుంచి భారత సంతతి నేత వివేక్‌ రామస్వామికి ఓ ప్రతికూల ప్రకటన వచ్చింది. ట్రంప్‌నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని ఆ ప్రకటన తెలిపింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడి సన్నిహిత అనుచరుడిని ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి యత్నిస్తున్నారు. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఆయన.. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించడానికి గతంలో సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు దానిపై ట్రంప్‌ నుంచీ సానుకూల స్పందనే వచ్చింది. మీరు ఆయనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా.. అని ప్రశ్నించగా.. ‘ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నా’ అని బదులిచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్‌ వర్గం నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ‘ఓటర్లు వివేక్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోకపోవచ్చు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు’ అని ఆ వర్గం వెల్లడించింది.

నేనూ ఉండను: హేలీ

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ఏకైక మహిళ నిక్కీ హేలీ.. ఉపాధ్యక్షురాలిగా ఉండటంపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. తదుపరి అమెరికా అధ్యక్షురాలిగా ఉండేందుకు, గెలిచేందుకు పోటీ పడుతున్నానని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని