Coronavirus: ‘కరోనా మేడ్ ఇన్ చైనాయే.. వుహాన్ ప్రయోగశాల నుంచే లీకయ్యింది’
యావత్ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 మూలాలపై మూడేళ్లయినా ఇంకా మిస్టరీ వీడలేదు.
‘ద ట్రూత్ ఎబౌట్ వుహాన్’ పుస్తకంలో వెల్లడించిన అమెరికా శాస్త్రవేత్త ఆండ్రూ హఫ్స్
యావత్ ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 మూలాలపై మూడేళ్లయినా ఇంకా మిస్టరీ వీడలేదు. చైనాలోని వుహాన్‌లో తొలుత బయటపడిన ఈ వైరస్‌కు సంబంధించిన మూలాలపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఫలితం మాత్రం తేలలేదు. ఈ క్రమంలోనే.. కరోనా మానవ నిర్మిత వైరస్ అంటూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు సంచలన విషయాన్ని వెల్లడించారు. గతంలో వుహాన్ ప్రయోగశాలలో పనిచేసిన ఆయన.. అక్కడి నుంచే వైరస్ లీకయ్యిందంటూ బహిరంగపరచడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఈ మేరకు ఆండ్రూ హఫ్స్ ‘ది ట్రూత్ ఎబౌట్ వుహాన్’ పేరుతో తాజాగా ఓ పుస్తకం రాశారు. ‘వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే కరోనా వైరస్ లీకయ్యింది’ అంటూ ఆ పుస్తక సారాంశాన్ని బ్రిటన్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక ప్రచురించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ది న్యూయార్క్ పోస్టు కూడా ఓ కథనాన్ని రాసింది. వైరస్‌లపై పరిశోధనలు జరిపే క్రమంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల.. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకయ్యిందని ఆండ్రూ హఫ్స్ ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ ప్రయోగశాలల్లో బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అవసరమైన నియంత్రణ చర్యలు లేకపోవడం.. వుహాన్ ప్రయోగశాల నుంచి వైరస్ లీకవడానికి దారితీసిందని హఫ్స్ చెప్పినట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!