Epstein files: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం పత్రాల్లో హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత!

Epstein files: బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ, అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, బిల్‌ క్లింటన్‌ సహా పలువురు ప్రముఖుల పేర్లు ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఉన్నట్లు బహిర్గతమైంది.

Updated : 07 Jan 2024 16:56 IST

వాషింగ్టన్‌: అమెరికాలో వెలువడుతున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’తో రోజుకో ప్రముఖుడి పేరు తెరపైకి వప్తోంది. శనివారం విడుదలైన మూడో దఫా పత్రాల్లో హాలీవుడ్‌ మాజీ నిర్మాత హార్వే వైన్‌స్టెయిన్ పేరు బయటకొచ్చింది. పలువురు మహిళలను లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేలిన అతడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

వైన్‌స్టెయిన్ 2005లో మార్చిలో ఎప్‌స్టీన్‌ను సంప్రదించినట్లుగా తాజా పత్రాల్లో వెల్లడైంది. ‘‘ఓ అమ్మాయి ఫోన్‌లో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది’’ అని చెబుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఇష్టమైన ఓ అమ్మాయితో అమర్యాదగా ప్రవర్తించటంతో వైన్‌స్టెయిన్‌ను ఎప్‌స్టీన్‌ ఫ్రాన్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటేసినట్లు తాజా పత్రాల్లో ఉంది. ఇంకెప్పుడూ తనని కలవొద్దని హెచ్చిరించినట్లు రాసుంది.

ప్రముఖ పెట్టుబడిదారుడు, సంపన్నుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ శృంగార లీలలపై న్యాయస్థానానికి సమర్పించిన దస్త్రాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మైనర్‌ బాలికలు, సినీతారలు, మోడళ్లను రంగంలో దించి తన బంగ్లాల్లో వారితో ప్రముఖులు గడిపేలా ఆ వ్యక్తి అన్ని ఏర్పాట్లు చేసేవాడని పలువురి వాంగ్మూలాలు వెల్లడిస్తున్నాయి. ఎప్‌స్టీన్‌ వద్ద పనిచేసినవారు కొన్ని వివరాలు వెల్లడించగా, ఫోన్‌ సందేశాల ప్రతులు మరికొన్నింటిని బహిర్గతం చేస్తున్నాయి. బాలికలను ఎప్‌స్టీన్‌ తన అవసరాలకు ఎలా ఉపయోగించుకునేవాడో అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఘిస్లైన్‌ మాక్స్‌వెల్‌పై దాఖలైన పరువునష్టం కేసులో ఓ బాధితురాలు కొంతమేర బయటపెట్టింది. బ్రిటన్‌ యువరాజు ఆండ్రూ, అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, బిల్‌ క్లింటన్‌ సహా పలువురు ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నట్లు బహిర్గతమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని