4 వారాల్లో ప్రైవేటు పాఠశాలలపై చర్యలు
close

ప్రధానాంశాలు

4 వారాల్లో ప్రైవేటు పాఠశాలలపై చర్యలు

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ సమయంలో అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాలలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ జీవో 46ను ఉల్లంఘిస్తున్నాయంటూ హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌, ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను ఆపేయాలని హైదరాబాద్‌కు చెందిన విజయ్‌గోపాల్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ ప్రభుత్వ చర్యలను వివరించారు. ‘‘అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. అవి వివరణ ఇచ్చాయి. వాటిని పరిశీలించి 4 వారాల్లో చర్యలు తీసుకుంటాం. అయితే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో )ేవు. వాటిపై ఆయా బోర్డులే చర్యలు తీసుకోవాలి’’ అని తెలిపారు. దీన్ని నమోదు చేసిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను మూసివేస్తున్నామంది. అలాగే ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని