గవర్నర్‌తో ఐఐఎస్‌ శిక్షణ అధికారుల భేటీ

ప్రధానాంశాలు

గవర్నర్‌తో ఐఐఎస్‌ శిక్షణ అధికారుల భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: అఖిల భారత సమాచార సేవల (ఐఐఎస్‌) శిక్షణ అధికారులు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిశారు. సివిల్‌ సర్వీసెస్‌లో ఐఐఎస్‌ను ఎంచుకోవడం అభినందనీయమని ఆమె అన్నారు. యువ అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ సమాచార రంగంలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. అలాగే జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సభ్యునిగా నియమితులైన అంకాలజిస్టు జి. సూర్యనారాయణరాజును ఆమె అభినందించారు. దక్షిణభారత సాంస్కృతిక సంఘం (ఎస్‌ఐసీఏ) అధ్యక్షుడు ఎస్‌.చక్రవర్తి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని