Dearvasuarticle News, Headlines, Breaking News, Articles
close
Published : 13/08/2021 20:02 IST
Facebook Share WhatsApp Share Telegram Share

కలయిక జరగకపోవడానికి కారణమదేనా?

హలో డాక్టర్‌. నా వయసు 25. నాకు పెళ్లై ఆరు నెలలవుతోంది.. అయినా ఇప్పటిదాకా మా ఇద్దరికీ కలయిక జరగలేదు. ఎంత ప్రయత్నించినా కలయిక సమయంలో బాగా నొప్పిగా ఉంటుంది. నా Hymenలో ఏమైనా సమస్య ఉందేమో అని డౌట్‌గా ఉంది. చాలా లూబ్రికెంట్స్‌ కూడా వాడాం.. అయినా ఫలితం లేదు. కొంతమందికి Hymen, Vagina Opening చిన్నదిగా ఉంటుందని నేను నెట్‌లో చదివాను. నా సమస్యకు పరిష్కారం దొరకాలంటే నేనేం చేయాలి?

- ఓ సోదరి

జ: సాధారణంగా పెళ్లైన కొత్తలో కలయిక సమయంలో ఇబ్బంది, నొప్పి ఉన్నా కూడా సమయం గడుస్తున్న కొద్దీ వాటికవే సర్దుకుంటాయి. మీరు ఏదైనా సమస్య ఉందేమో అని అనుమానించే బదులు ఒకసారి గైనకాలజిస్ట్‌ దగ్గరికి వెళ్తే మీకున్న సమస్యేంటో చూసి దానికి పరిష్కారం చెప్తారు.

అయితే సాధారణంగా సమస్య రెండు రకాలుగా ఉండచ్చు.. మొదటిది - శారీరకమైంది.. అంటే మీరు సందేహిస్తున్నట్లుగా- Hymen, Vaginaలో సమస్యలుండచ్చు. రెండోది - మానసికమైనది. విపరీతమైన ఆందోళన, భయం వల్ల భర్త దగ్గరికి రాగానే కండరాలన్నీ ముడుచుకుపోయి కలయిక జరగకుండా అడ్డుకుంటాయి. ఈ సమస్యను Vaginismus అంటారు. ఒకవేళ మీ గైనకాలజిస్ట్‌ మీకు పరీక్ష చేసి మీకు శారీరకంగా ఏ లోపమూ లేదని చెప్తే.. వారే మిమ్మల్ని కౌన్సెలింగ్‌కి వెళ్లమని సలహా ఇస్తారు.

మీ ప్రశ్న అడగండి

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని