Hyderabad vs Delhi: ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ సిక్సర్ల మోత.. పవర్‌ప్లేలో రికార్డు స్కోరు

ఐపీఎల్‌-17లో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిక్సర్ల మోత మోగించడంతో పవర్‌ ప్లే అయ్యేసరికే స్కోరు 125కు చేరుకుంది.

Updated : 21 Apr 2024 10:41 IST

ఐపీఎల్‌-17లో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు విధ్వంసానికి ప్రత్యర్థి దిల్లీ క్యాపిటల్స్‌ బలైంది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ సిక్సర్ల మోత మోగించారు. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఎన్నడూ చూడని విధ్వంస చిత్రాన్ని ఈ జోడీ దిల్లీపై చూపించింది. 0, 6, 4, 4, 1, 4, 6, 6, 0, 4, 1, 4, 4, 4, 0, 4, 4, 6, 6, 1, 1, 6, 1, 6, 6, 6, 1, 0, 1, 6, 4, 4, 4, 4, 0, 6, 6.. తొలి వికెట్‌ పడడానికి ముందు హెడ్‌, అభిషేక్‌ కలిసి సాగించిన ధ్వంస రచన ఇది. 19, 21, 22, 21, 20.. ఓవర్‌కు 20కి అటు ఇటుగా పరుగులు చేస్తూ కేవలం 5 ఓవర్లలోనే స్కోరును వంద దాటించేసిందీ జోడీ. దీంతో పవర్‌ ప్లే అయ్యేసరికే స్కోరు 125కు చేరుకుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు