Anakapalli: ఆసక్తికరంగా అనకాపల్లి పోరు.. ఎంపీగా గెలిచేదెవరో?

తొమ్మిది ఓట్ల తేడాతో ఒక పార్లమెంట్ స్థానం ఫలితం నిర్దేశించిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తుకొచ్చేది.. అనకాపల్లి. జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు.. ఈసారి ఎవరిని అందలం ఎక్కిస్తాయన్నది అసక్తికరంగా మారింది.

Published : 29 Apr 2024 19:55 IST

తొమ్మిది ఓట్ల తేడాతో ఒక పార్లమెంట్ స్థానం ఫలితం నిర్దేశించిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తుకొచ్చేది.. అనకాపల్లి. పోలైన లక్షల ఓట్లలో ఇక్కడ ఎంపీగా కేవలం 9 ఓట్ల మెజార్టీతో గెలిచి.. 1989లో కొణతాల రామకృష్ణ సంచలనం సృష్టించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల కలబోతగా ఉండే ఈ నియోజకవర్గం.. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెట్టని కోటగానే ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు వైకాపా అభ్యర్థులే కైవసం చేసుకున్నా.. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఈసారి ఫలితాలను తారుమారు చేయడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అనకాపల్లి జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు.. ఈసారి ఎవరిని అందలం ఎక్కిస్తాయన్నది అసక్తికరంగా మారింది.

Tags :

మరిన్ని