Gujarat vs Bengaluru: గుజరాత్‌పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌

బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్‌ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ మీరూ చూడండి. 

Published : 28 Apr 2024 20:01 IST

బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్‌ (100*; 41 బంతుల్లో 5×4, 10×6), కోహ్లీ (70*, 44 బంతుల్లో 6×4, 3×6) చెలరేగారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. బంతి పడితే చాలు.. బౌండరీ అన్నట్లుగా ఆడారు. వీరి బాదుడుకు 201 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. డుప్లెసిస్‌ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో రవి శ్రీనివాసన్‌ ఒక వికెట్‌ రాబట్టుకున్నాడు.

Tags :

మరిన్ని