చెన్నై ఆల్‌రౌండ్‌ షో.. ఆ జట్టు విజయ సంబరాలు చూశారా..

ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌ను చెన్నై జట్టు 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 212 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

Published : 29 Apr 2024 01:06 IST

సొంతగడ్డ చెపాక్‌లో చెన్నైకి అదరిపోయే విజయం లభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్నింట్లోనూ చెన్నై ఆటగాళ్లు దుమ్మురేపారు. ఈ సీజన్‌లో భారీ స్కోర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హైదరాబాద్‌ను 78 పరుగుల తేడాతో చిత్తుచేయడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (98: 54 బంతుల్లో) అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారీ హిట్టర్లు ఉన్న హైదరాబాద్‌ను చెన్నై బౌలర్లు బెంబేలెత్తించారు. తుషార్‌ దేశ్‌పాండే నాలుగు వికెట్లు తీయగా, పతిరన, ముస్తాఫిజుర్‌ తలో రెండు, జడేజా, శార్దూల్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈమ్యాచ్‌లో  చెన్నై ఆటగాడు డారిల్‌ మిచెల్‌ ఒక్కడే ఐదు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం చెన్నై గెలుపు సంబరాలను చూసేయండి మరీ..

Tags :

మరిన్ని