Fake FingerPrints: ప్రకాశం జిల్లాలో రబ్బరు వేలుతో వాలంటీర్‌ మోసం!

ప్రకాశం జిల్లా పామూరు మండలం కట్టకిందపల్లిలో పింఛన్‌ కోసం లబ్ధిదారులు వాలంటీర్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా వాలంటీర్ లేకపోవడమే ఇందుకు కారణం. వేలిముద్రలతో కూడిన ఓ కృత్రిమ రబ్బరు వేలును తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. వాలంటీర్‌ బెంగళూరుకు వెళ్లాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాళ్లు దాని సాయంతో పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ తంతుపై ప్రశ్నించిన వారికి పింఛన్ నిలిపివేస్తున్నారు. ఈ నెలలో ఇలా కొందరికి పింఛన్ నిలిపివేయడంతో.. ఈ రబ్బర్ వేలు తతంగం వెలుగులోకి వచ్చింది.

Updated : 02 Aug 2023 19:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు