IND vs AUS: నేడే ప్రపంచకప్‌ ఫైనల్‌.. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సందడి

దేశవ్యాప్తంగా ప్రపంచకప్ (ODI WC 2023) ఫైనల్ ఫీవర్ కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు. భారత జట్టు జెర్సీలను ధరించి ప్రజలు రాత్రి నుంచే స్టేడియం వద్ద ఉత్సాహంగా చిందేశారు. దేశ జెండాలతో వచ్చి రోహిత్ సేన విజయం సాధించాలని కేరింతలు కొడుతున్నారు. కార్లతో అహ్మదాబాద్‌లో ర్యాలీ తీశారు. భారత్‌-ఆస్ట్రేలియా (IND vs AUS) పోరును వీక్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ముంబయి, దిల్లీ నుంచి అభిమానులు ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లారు.

Published : 19 Nov 2023 09:33 IST
Tags :

మరిన్ని