Bumrah: బుమ్రా బుల్లెట్‌ యార్కర్‌.. నిశ్చేష్టుడై పెవిలియన్‌ చేరిన నరైన్‌

కోల్‌కతా చేతిలో ముంబయికి మరో ఓటమి తప్పలేదు. అయితే, స్టార్‌ పేసర్‌ బుమ్రా ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్‌ (0)ను బుమ్రా ఔట్‌ చేసిన తీరు అద్భుతం.

Published : 12 May 2024 09:51 IST

కోల్‌కతా చేతిలో ముంబయికి మరో ఓటమి తప్పలేదు. అయితే, స్టార్‌ పేసర్‌ బుమ్రా ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్‌ (0)ను బుమ్రా ఔట్‌ చేసిన తీరు అద్భుతం. ఓ బుల్లెట్‌ ఇన్‌స్వింగింగ్‌ యార్కర్‌తో బ్యాటర్‌ను అతడు బౌల్డ్‌ చేశాడు. బంతి వెలుపలికి వెళ్తుందనుకున్నాడో ఏమో.. నరైన్‌ బ్యాటైనా దించలేదు. ఆ సంచలన డెలివరీకి నిశ్చేష్టుడై పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని