IPL 2024: ‘బౌండరీ’ లైన్‌ వద్ద సూపర్ క్యాచ్‌.. జాంటీ రోడ్స్ ప్రశంసలు

ఓ కుర్రాడిపై జాంటీ రోడ్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పుడు అతడు నెట్టింట వైరల్‌గా మారిపోయాడు.

Updated : 06 May 2024 14:15 IST

బౌండరీ బాయ్‌ అథర్వ్‌ గుప్తాపై ప్రశంసలు కురిపించాడు లఖ్‌నవూ ఫీల్డింగ్‌ కోచ్ జాంటీ రోడ్స్. కోల్‌కతా - లఖ్‌నవూ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అథర్వ్‌ బౌండరీ బాయ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, స్టానియిస్‌ కొట్టిన బంతి సిక్స్‌గా వెళ్లింది. అక్కడే ఉన్న అథర్వ్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. దీనికి జాంటీ రోడ్స్‌ అభినందిస్తూ.. మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో అతడిని కలిశాడు. గతంలో ఓ టీ20 మ్యాచ్‌ సందర్భంగా జాంటీ ఇచ్చిన సూచనల ప్రకారమే ఇప్పుడు క్యాచ్‌ను అందుకొన్నట్లు గుప్తా చెప్పాడు. గుర్తుంచుకున్నందుకు జాంటీ సంతోషపడి ధన్యవాదాలు చెబుతూనే ప్రశంసల వర్షం కురపించాడు. ఈ సందర్భంగా క్యాచ్‌లకు సంబంధించి పలు సూచనలు చేశాడు.

Tags :

మరిన్ని