Kavya Maran: ఫైనల్లో ఓటమి.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లను ఓదార్చిన కావ్య మారన్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన ఫైనల్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లను ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్‌ ఓదార్చారు.

Published : 27 May 2024 19:12 IST

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SunRisers Hyderabad) ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో విధ్వంసకర ఆటతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. కీలకమైన ఫైనల్‌లో తేలిపోవడంతో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ ఆటగాళ్లతోపాటు జట్టు సహ యజమాని కావ్య మారన్‌ (Kavya Maran) ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. సీజన్‌ ఆద్యంతం జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిందని, అందువల్లే కోల్‌కతా ఛాంపియన్‌గా నిలిచినా మన (సన్‌రైజర్స్‌) గురించే మాట్లాడుకుంటున్నారని కావ్య మారన్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని