Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్‌ సూపర్‌ రన్నింగ్ క్యాచ్‌.. ఫీల్డింగ్‌ కోచ్‌ రియాక్షన్ చూశారా?

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

Published : 06 May 2024 14:44 IST

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. నవీనుల్‌ హక్ వేసిన 15వ ఓవర్‌లో రెండో బంతికి ఆండ్రీ రస్సెల్ (12) భారీ షాట్ ఆడగా.. కృష్ణప్ప గౌతమ్‌ బంతి గమనాన్ని పరిశీలిస్తూ ముందుకు పరుగెత్తి సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన లఖ్‌నవూ ఫీల్డింగ్‌ కోచ్ జాంటీ రోడ్స్‌ చప్పట్లు కొడుతూ ‘దట్స్‌ ఔట్‌’ అంటూ చిన్నపిల్లాడిలా సంబరాలు చేసుకున్నాడు.

Tags :

మరిన్ని