Lucknow X Chennai: పూరన్‌ విన్నింగ్‌ షాట్‌.. లఖ్‌నవూ గెలుపు సంబరాలు చూశారా?

ఐపీఎల్‌-17లో రెండు వరుస ఓటముల తర్వాత లఖ్‌నవూ (LSG) తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైని 8 వికెట్ల తేడాతో సులువుగా ఓడించింది.

Published : 20 Apr 2024 11:49 IST

ఐపీఎల్‌-17లో రెండు వరుస ఓటముల తర్వాత లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుతూ చెన్నై సూపర్‌కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. కేఎల్‌ రాహుల్‌ (82; 53 బంతుల్లో 9×4, 3×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు డికాక్‌ (54; 43 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం తోడవడంతో 177 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ సులువుగా ఛేదించింది. 3 ఓవర్లలో 16 పరుగులే చేయాల్సిన స్థితిలో రాహుల్‌ వెనుదిరిగినా.. స్టాయినిస్‌ (8 నాటౌట్‌)తో కలిసి నికోలస్‌ పూరన్‌ (23 నాటౌట్‌) పని పూర్తి చేశాడు.

Tags :

మరిన్ని