MS Dhoni: 103 ఏళ్ల అభిమానికి ఎమ్‌ఎస్‌ ధోనీ అపురూపమైన కానుక.. వీడియో

తన 103 ఏళ్ల అభిమానికి ఎమ్‌ఎస్‌ ధోనీ ఓ అపురూపమైన కానుక అందించారు. తాను స్వయంగా ఆటోగ్రాఫ్‌ పెట్టిన చెన్నై జెర్సీని.. ఆయనకు బహుమతిగా ఇచ్చారు.  ఆ జెర్సీని అందుకున్న రాందాస్‌ ఎంతగానో మురిసిపోయారు. వీడియో మీరూ చూడండి.

Updated : 04 May 2024 17:56 IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ ఎమ్‌ఎస్‌ ధోనీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి తమిళులంతా ధోనీని ఎంతగానో ఆరాధిస్తున్నారు. వీరిలో 103 ఏళ్ల అభిమాని కూడా ఉన్నారు. ఎస్‌ రాందాస్ అనే ఆ సూపర్‌ ఫ్యాన్‌కు ధోనీ ఓ అపురూపమైన కానుక అందించారు. తాను స్వయంగా ఆటోగ్రాఫ్‌ పెట్టిన చెన్నై జెర్సీని.. ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ‘థ్యాంక్స్‌ తాతా.. ఫర్‌ ది సపోర్ట్‌’ అని రాందాస్‌ పేరు సహా ఆయన వయసు ఉన్న ఆ జెర్సీపై ధోనీ రాశాడు. ఆ జెర్సీని అందుకున్న రాందాస్‌ ఎంతగానో మురిసిపోయారు. వీడియో మీరూ చూడండి.

Tags :

మరిన్ని