Cricket News: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. నేపాల్‌ క్రికెటర్‌ రికార్డు

నేపాల్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ మరోసారి రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. ఏసీసీ పురుషుల ప్రిమియర్‌ కప్‌ టీ20 అంతర్జాతీయ టోర్నీలో ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర ఈ ఘనత సాధించాడు. కమ్రాన్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అతను వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఈ రికార్డు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

Published : 14 Apr 2024 10:21 IST

Tags :

మరిన్ని