Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్‌!

లఖ్‌నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ ఒడిసిపట్టాడు.

Updated : 20 Apr 2024 15:57 IST

లఖ్‌నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి ఫీల్డింగ్‌లో అద్భుత ప్రతిభను బయటపెట్టాడు. పతిరన వేసిన బంతిని ఆఫ్‌సైడ్‌ కొట్టిన కేఎల్‌ రాహుల్‌.. అది బౌండరీ వెళ్తుందని భావించాడు. బ్యాక్‌వర్డ్‌ పాయింట్ వద్ద కాచుకుని ఉన్న జడ్డూ దానిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘ఇది క్యాచ్ ఆఫ్‌ ఐపీఎల్‌ అవుతుంది. అద్భుతంగా పట్టాడు. బుల్లెట్‌లా ఎగిరాడు’’ అని వ్యాఖ్యానించాడు. ఆ క్యాచ్‌ను చూసిన కెప్టెన్ రుతురాజ్‌ కూడా నమ్మలేనట్లుగా ఎక్స్‌ప్రెషన్‌ పెట్టాడు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు