PV Ramesh: ఏపీ అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి.. పేదలపైనే పెనుభారం! : పి.వి.రమేష్

ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విశ్రాంత ఐఏఎస్, పూర్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Updated : 02 May 2024 18:44 IST

ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విశ్రాంత ఐఏఎస్, పూర్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మద్యపానం నుంచే రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తోందని.. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో పేదల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ప్రభుత్వం అంటే బటన్ నొక్కడమే కాదని.. ప్రజలతో నిరంతరం సంభాషించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో విడుదలవుతున్న ఉత్తర్వులన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా చేశారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు స్వప్రయోజనాల కోసం వ్యక్తులకు దాసోహమైతే.. రాజద్రోహం చేసినట్లేనన్నారు.

Tags :

మరిన్ని