Somu Veerraju: ఏపీలో వైకాపా పాలన.. డబ్బింగ్‌ సినిమాను తలపిస్తోంది!: సోము వీర్రాజు

ఏపీలో వైకాపా (YSRCP) ప్రభుత్వ పాలన డబ్బింగ్‌ సినిమాను తలపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిథులకు పేర్లు మార్చి.. వాటిని తమవిగా వైకాపా నేతలు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు.  75 శాతం లబ్ధిదారులకు అందుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం ఇస్తున్నవే అనే విషయంపై ప్రజల్లో అవగాహన పెంపొందింపజేస్తున్నామని విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. 

Published : 24 Jun 2023 17:40 IST

Tags :

మరిన్ని